Share News

ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్.. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:45 PM

డెరివేటివ్స్ మార్కెట్‌లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు బ్రేకులు వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రకటించారు.

ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్.. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు
F&O trading - STT Hike

ఇంటర్నెట్ డెస్క్: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ (F and O Trading) ఖర్చులు పెరగనున్నాయి. డెరివేటివ్స్ మార్కెట్‌లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌‌ను (Speculative Trading) తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను (Securities Transaction Tax) పెంచినట్టు తెలిపారు. ఆప్షన్స్‌పై ఎస్‌టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచారు. ఫ్యూచర్స్‌పై ఎస్‌టీటీని 0.05 శాతానికి పెంచారు. ఇక కమోడిటీ ఫ్యూచర్స్‌పై ఎస్‌టీటీని కూడా మునుపటి 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్టు మంత్రి తెలిపారు (Budget 2026-27).

ఎస్‌టీటీ పెంపుతో టేడర్స్‌పై ఖర్చుల భారం పెరగనుంది. ముఖ్యంగా స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌తో నిత్యం మార్కెట్స్‌లో యాక్టివ్‌గా ఉండేవారిపై కాస్త భారం పెరగనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక, హై ఫ్రీక్వెన్సీ (High Frequency Trading) స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు బ్రేకులు వేయడం కేంద్రం ఉద్దేశమని చెప్పారు. అయితే, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లపై (Long Term Investors) ఈ పెంపు ప్రభావం ఉండదని అంటున్నారు. మార్కెట్‌లో నగదు లభ్యతకు (Liquidity), స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌‌కు మధ్య సమతౌల్యత సాధించాలని చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండాలని అన్నారు. నష్ట భయం లేకుండా హెడ్జింగ్‌కు దిగే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లపై ఈ పెంపుతో ఎలాంటి ప్రభావం ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు తీవ్రస్థాయి హెచ్చుతగ్గులకు లోనైన విషయం తెలిసిందే.


ఇక ఈసారి బడ్జెట్‌లో కేంద్రం మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చింది. కేపెక్స్ ఖర్చులకు రూ.12.2 లక్షల కోట్లను కేటాయించింది. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. 2014లో రూ.2 లక్షల కోట్లుగా ఉన్న కేటాయింపులు 2024-25 నాటి బడ్జెట్ అంచనాల్లో రూ.11.2 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.


ఇవీ చదవండి:

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

Updated Date - Feb 01 , 2026 | 05:55 PM