Share News

బీఎస్ఎన్ఎల్‌ను ప్రైవేటీకరించం సింధియా

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:05 AM

ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎ్‌సఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా...

బీఎస్ఎన్ఎల్‌ను ప్రైవేటీకరించం సింధియా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎ్‌సఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం చెప్పారు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న బీఎ్‌సఎన్‌ఎల్‌ను ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు విడతల్లో రూ.3.22 లక్షల కోట్ల ఆర్థిక సహాయంతో ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 4జీ సేవల విస్తరణ ప్రారంభమైందన్నారు. వాటిని స్థిరీకరించిన తర్వాత బీఎ్‌సఎన్‌ఎల్‌ 5జీ టెలికం సేవలు సైతం ప్రారంభిస్తుందని సింధియా చెప్పారు.

ఇవి కూడా చదవండి..

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..

Updated Date - Mar 19 , 2026 | 02:05 AM