టాటా ట్రస్ట్‌లకు కోర్టులో దక్కని ఊరట
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:26 AM
టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను మూ డోసారి తిరిగి నియమించడాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసిన టాటా ట్రస్ట్‌లకు నిరాశే ఎదురైంది.
ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను మూ డోసారి తిరిగి నియమించడాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసిన టాటా ట్రస్ట్‌లకు నిరాశే ఎదురైంది. ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయస్థానం.. ట్రస్ట్‌లకు తక్షణ ఊరట కల్పించేందుకు నిరాకరించింది. షెడ్యూలు ప్రకారంగా ఈనెల 30న టాటా సన్స్ బోర్డు సమావేశం జరగనివ్వాలని, ఆ భేటీ నిర్ణయాలు వెలువడ్డాక తమ తుది ఆదేశాలను జారీ చేయడం జరుగుతుందని జస్టిస్ అభయ్ అహూజా స్పష్టం చేశారు.