బోయింగ్ 737 మ్యాక్స్‌లో లోపాలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:30 AM
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లోని కొన్ని మోడళ్లలో సాఫ్ట్‌వేర్ లోపాన్ని గుర్తించినట్లు విమాన తయారీ సంస్థ...
న్యూఢిల్లీ: బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లోని కొన్ని మోడళ్లలో సాఫ్ట్‌వేర్ లోపాన్ని గుర్తించినట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ వెల్లడించింది. ల్యాండింగ్ సమయంలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా నిలిచిపోయే ప్రమాదం ఉందని గుర్తించినట్లు బోయింగ్ తెలిపింది. ఈ సాంకేతిక లోపానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు తమ ఇంజనీర్లు వేగంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. కాగా భారత్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్.. మొత్తం 96 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడుపుతున్నాయి.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే