Share News

డేటా సెంటర్లలోకి బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:27 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ సంస్థ బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (బీసీఎ్‌సఎ్‌సఎల్‌) డేటా సెంటర్ల వ్యాపారంలోకి...

డేటా సెంటర్లలోకి బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ సంస్థ బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (బీసీఎ్‌సఎ్‌సఎల్‌) డేటా సెంటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వద్ద 100 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఈఓ చంద్రశేఖర్‌ ముద్రగణం వెల్లడించారు. ఈ డేటా సెంటర్‌ కోసం మూడు దశల్లో 35 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వివరించారు. తదుపరి దశ విస్తరణలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. కాగా 2025-26లో కంపెనీ ఆదాయం రూ.1,002 కోట్లుగా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రశేఖర్‌ వెల్లడించారు. బ్లూ క్లౌడ్‌.. హెల్త్‌కేర్‌ విభాగంలో బ్లూహెల్త్‌, బ్లూకియోస్క్‌, బ్లూబయో, బయోస్టర్‌, బ్లూహెల్త్‌ పేరుతో పలు ఏఐ ఆధారిత సేవలందిస్తోందని చంద్రశేఖర్‌ వివరించారు. కంపెనీ హెల్త్‌కేర్‌ విభాగం.. క్యాన్సర్‌ సంబంధిత పరిశోధనల కోసం రూ.400 కోట్ల పెట్టుబడితో ఏపీలోని గుంటూరులో బయోబ్యాంక్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కాగా కంపెనీ కార్యకలాపాల విస్తరణ కోసం భారత్‌తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 27 , 2026 | 05:27 AM