Share News

స్పేస్‌ఎక్స్‌తో బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ చర్చలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:40 AM

కృత్రిమ మేధ (ఏఐ) అవకాశాలు, డిజిటల్‌ టెక్నాలజీ అంశాల్లో సహకారం కోసం హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌.. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని..

స్పేస్‌ఎక్స్‌తో బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ చర్చలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృత్రిమ మేధ (ఏఐ) అవకాశాలు, డిజిటల్‌ టెక్నాలజీ అంశాల్లో సహకారం కోసం హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌.. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ‘స్పేస్‌ఎక్స్‌ ఇంటర్నేషనల్‌’ కంపెనీతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్టు కంపెనీ సోమవారం రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. ఈ చర్చలు కేవలం ఏఐ అవకాశాలు, డిజిటల్‌ టెక్నాలజీల విషయంలో సహకరించుకునేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే విషయం ధ్రువపరుచుకునేందుకు మాత్రమేనని పేర్కొంది. ఈ వార్తలతో సోమవారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు ఏకంగా 19.82 లాభంతో రూ.21.64 వద్ద క్లోజైంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగారం దిగుమతులు 70 శాతం డౌన్‌

బంగారం, వెండి భారీగా తగ్గాయ్‌

Updated Date - Jun 23 , 2026 | 05:40 AM