Share News

ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్‌ గుట్టురట్టు

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:38 AM

క్యాన్సర్‌ టెస్టులు మరింత సులభం కానున్నాయి. ఒక్క రక్తపు బొట్టుతో శరీరంలో క్యాన్సర్‌ ఉందా? లేదా? అని తెలిపే టెక్నాలజీ...

ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్‌ గుట్టురట్టు

జైడ్‌సతో అపోలో హాస్పిటల్స్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్యాన్సర్‌ టెస్టులు మరింత సులభం కానున్నాయి. ఒక్క రక్తపు బొట్టుతో శరీరంలో క్యాన్సర్‌ ఉందా? లేదా? అని తెలిపే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. షీల్డ్‌ మల్టీ క్యాన్సర్‌ డిటెక్షన్‌ (ఎంసీడీ)గా పిలిచే ఈ టెక్నాలజీని అపోలో హాస్పిటల్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం జైడస్‌ లైఫ్‌సైన్సె్‌సతో అపోలో హాస్పిటల్స్‌ ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన గార్డెంట్‌ హెల్త్‌ ఇంక్‌.. ఈ టెక్నాలజీని జైడస్‌ లైఫ్‌సైన్సె్‌సకు అందిస్తోంది. జైడస్‌ లైఫ్‌.. ఈ టెక్నాలజీకి భారత్‌లో ప్రధాన పంపిణీదారు. ఎంసీడీ టెస్టు ద్వారా శరీరంలోని వివిధ అవయవాల్లో తలెత్తే వివిధ రకాల క్యాన్సర్లను ముందుగానే అత్యంత కచ్చితత్వంతో గుర్తించి జాగ్రత్త పడవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

For More Business News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 01:38 AM