పెరిగిన ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు.. రెపో రేటును పెంచిన ఆర్బీఐ
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:26 AM
భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును పెంచింది. 25 బేసిస్ పాయింట్స్ మేర పెంచడంతో తాజా రెపో రేటు 5.5 శాతానికి చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును పెంచింది. 25 బేసిస్ పాయింట్స్ మేర పెంచడంతో తాజా రెపో రేటు 5.5 శాతానికి చేరుకుంది. 2023 ఫిబ్రవరి తరువాత కీలక వడ్డీ రేటును పెంచడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక వడ్డీ రేటును పెంచేందుకే ఆర్‌బీఐ మొగ్గు చూపించింది. రేటు పెంపు తప్పదని అంతకుముందే మార్గెట్ వర్గాలు అంచనా వేసిన విషయం తెలిసిందే.
మూడు రోజుల పాటు ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. అయితే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల దృష్ట్యా వడ్డీ రేటు పెంపు తప్పలేదని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగిందని అన్నారు. వచ్చే మూడు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 5.8 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే, వార్షిక సగటు మాత్రం 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పెరిగిన ఆహార, ఇంధన ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో ఒడిదుడుకుల కారణంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచింది.
ఈ వార్తలనూ చదవండి:
రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం
ఏడాదికి ఒక్కసారే జీఎస్‌టీ రేట్ల సవరణ