డీఆర్‌డీవో-ఎన్‌ఎస్‌టీఎల్‌తో బీహెచ్‌ఈఎల్ ఒప్పందం
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:30 AM
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఆయుధ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీ...
న్యూఢిల్లీ: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఆయుధ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీ బదిలీ కోసం డీఆర్‌డీవోకు చెందిన విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నోలాజికల్ లేబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద నౌకాదళానికి అవసరమైన కొన్ని ప్రత్యేక అధునాతన ఆయుధ వ్యవస్థల తయారీకి అవసరమైన టెక్నాలజీనీ ఎన్‌ఎస్‌టీఎల్.. బీహెచ్‌ఈఎల్‌కు బదిలీ చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..