Share News

బీహెచ్‌ఈఎల్‌ వాటాలకు భారీ స్పందన

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:31 AM

ప్రభుత్వ రంగంలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (బీహెచ్‌ఈఎల్‌) వాటా విక్రయానికి భారీ స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో...

బీహెచ్‌ఈఎల్‌ వాటాలకు భారీ స్పందన

ప్రభుత్వ రంగంలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (బీహెచ్‌ఈఎల్‌) వాటా విక్రయానికి భారీ స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎ్‌ఫఎస్‌) సంస్థాగత ఇన్వెస్టర్లు తొలిరోజు రూ.5,650 కోట్ల విలువైన షేర్లకు బిడ్లు సమర్పించారు. కనీస ఇష్యూ సైజుకు 2.3 రెట్ల బిడ్లు లభించాయి. బీహెచ్‌ఈఎల్‌లో 5ు వరకు వాటాను కేంద్రం విక్రయించనుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) మంగళవారం వెల్లడించింది. ఒక్కో షేరు కనీస ధరను రూ.254గా నిర్ణయించారు.

6 శాతం క్షీణించిన షేరు: కంపెనీలో ప్రభుత్వం వాటా విక్రయిస్తున్న నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌ షేరు ధర బుధవారం బీఎ్‌సఈలో ఒకదశలో 6.07 శాతం క్షీణించి రూ.259.30 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 5.58 శాతం నష్టంతో రూ.260.65 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి..

దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం

Updated Date - Feb 12 , 2026 | 05:31 AM