హైదరాబాద్‌లో భీమ జువెల్స్ విస్తరణ
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:34 AM
భీమ జువెల్స్.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు విస్తరించింది. తాజాగా కొండాపూర్‌లో బొటానికల్ గార్డెన్‌కు ఎదురుగా కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో సంస్థకు...
కొండాపూర్‌లో కొత్త షోరూమ్ ఏర్పాటు
హైదరాబాద్: భీమ జువెల్స్.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు విస్తరించింది. తాజాగా కొండాపూర్‌లో బొటానికల్ గార్డెన్‌కు ఎదురుగా కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో సంస్థకు ఇది ఐదో షోరూమ్. టాలీవుడ్ నటి సంయుక్త మీనన్, భీమ జువెల్స్ చైర్మన్ బీ. బిందు మాధవ్, ఎండీ అభిషేక్ బిందు మాధవ్, డైరెక్టర్ సరోజినీ బిందు మాధవ్, శాసనసభ్యులు అరికెపూడి గాంధీ లాంఛనంగా ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బీ. బిందు మాధవ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రూ.400 కోట్ల పెట్టుబడితో మరో నాలుగు షోరూమ్స్‌ను ప్రారంభించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ రీజియన్‌లో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఈ షోరూమ్‌లో విస్తృత శ్రేణి బంగారం, వజ్రాభరణాలతో పాటు వెండి ఆభరణాలు కూడా అందుబాటులో ఉంటాయని భీమ జువెల్స్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..