ఎయిర్‌టెల్ లాభంలో 55% క్షీణత
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:47 AM
నెట్‌వర్క్ నిర్వహణ వ్యయాలు భారం కావడం, చట్టపరమైన ఫీజులు, సిబ్బంది వ్యయాలు డిసెంబరు త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్...
నెట్‌వర్క్ నిర్వహణ వ్యయాలు భారం కావడం, చట్టపరమైన ఫీజులు, సిబ్బంది వ్యయాలు డిసెంబరు త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 55ు క్షీణించి రూ.6,630.5 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.14,781.2 కోట్లుంది. డిసెంబరు త్రైమాసికంలో లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ చార్జీల రూపంలో రూ.3,846 కోట్లు చెల్లించినట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగులపై వ్యయం కూడా 21ు పెరిగి రూ.1,958 కోట్లకు చేరింది. క్యూ3లో కంపెనీ ఆదాయం 19.6% పెరిగి రూ.53,982 కోట్లుగా నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు