Share News

ఎయిర్‌టెల్‌ ఆదాయం రూ.60,877 కోట్లు

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:17 AM

టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.60,877.5 కోట్ల ఏకీకృత రాబడిపై రూ.10,710 కోట్ల ఏకీకృత లాభాన్ని...

ఎయిర్‌టెల్‌ ఆదాయం రూ.60,877 కోట్లు

న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.60,877.5 కోట్ల ఏకీకృత రాబడిపై రూ.10,710 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.52,145.4 కోట్ల ఆదాయంపై రూ.8,651 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ లాభంలో 24ు, ఆదాయంలో 16.7ు వృద్ధి నమోదైంది. భారతి ఎయిర్‌టెల్‌ ఇండియా రాబడి 9.4ు పెరిగి రూ.42,308 కోట్లకు చేరుకుంది. ఇండియా మొబైల్‌ సర్వీస్‌ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.1 శాతం పెరిగింది. రెండో త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు రాబడి (ఆర్పూ) రూ.256 నుంచి రూ.271కి పెరిగింది.

ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 06 , 2026 | 06:17 AM