Share News

విలువైన కంపెనీల్లో ఎయిర్‌టెల్‌ నం.2

ABN , Publish Date - May 19 , 2026 | 02:18 AM

మార్కెట్‌ విలువపరంగా భారతీ ఎయిర్‌టెల్‌ మరో మైలురాయికి చేరింది. రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో...

విలువైన కంపెనీల్లో ఎయిర్‌టెల్‌ నం.2

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టిన ప్రైవేట్‌ టెలికాం సంస్థ

ముంబై: మార్కెట్‌ విలువపరంగా భారతీ ఎయిర్‌టెల్‌ మరో మైలురాయికి చేరింది. రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును అధిగమించి దేశంలో అత్యంత విలువైన రెండో లిస్టెడ్‌ కంపెనీగా అవతరించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు రూ.11.7 లక్షల మార్కెట్‌ క్యాప్‌తో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. సోమవారం ఎయిర్‌టెల్‌ షేర్లు 1.76 శాతం లాభంతో రూ.1,938.10 వద్ద, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేర్లు 0.10 శాతం లాభంతో రూ.768.55 వద్ద ముగియడంతో ఇది సాధ్యమైంది.

ఇవి కూడా చదవండి..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..

ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

Updated Date - May 19 , 2026 | 02:18 AM