Share News

అష్నీర్ గ్రోవర్ కామెంట్స్‌తో మాకు సంబంధం లేదు.. భారత్‌పే స్పష్టీకరణ

ABN , Publish Date - Sep 17 , 2026 | 10:05 PM

యూపీఐ ఎండీఆర్ చార్జీల విషయంలో భారత్‌‌పే సహవ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని సంస్థ సీఈఓ నళిన్ నేగీ తాజాగా పేర్కొన్నారు.

అష్నీర్ గ్రోవర్ కామెంట్స్‌తో మాకు సంబంధం లేదు.. భారత్‌పే స్పష్టీకరణ
BharatPe on MDR Charges

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ ఎండీఆర్ చార్జీల విషయంలో భారత్‌‌పే సహవ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని సంస్థ సీఈఓ నళిన్ నేగీ తాజాగా పేర్కొన్నారు. 2024 నుంచి అష్నీర్‌తో కంపెనీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఆయనకు సంస్థలో ఎలాంటి వాటా లేదని, సంస్థ కార్యకలాపాలతో సంబంధం లేదని చెప్పారు. ఎమ్‌డీఆర్ చార్జీల విధింపు నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ చార్జీలు చెల్లింపుల వ్యవస్థ సుస్థిరతకు దోహదపడతాయని అన్నారు. కస్టమర్లపై కూడా ఎలాంటి భారం ఉండదని చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులకూ రక్షణ ఉంటుందని అన్నారు.


ఈ సందర్భంగా ఆయన ఎన్‌పీసీఐ డేటాను ఉటంకించారు. 96 శాతం మర్చెంట్ టూ పేమెంట్ లావాదేవీలపై ఎమ్‌డీఆర్ ఉండదని అన్నారు. చెల్లింపుల విస్తరణకు, డిజిటలీకరణ పెరిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. నూతన విధానంతో చిన్న వ్యాపారులకు రక్షణ లభించడంతో పాటూ చెల్లింపుల ఎకోసిస్టమ్ బలోపేతమవుతుందని చెప్పారు.

ఎమ్‌‌డీఆర్ చార్జీల విధింపును అష్నీర్ గ్రోవర్ ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. అంతిమంగా వినియోగదారులపైనే భారం పడుతుందని అన్నారు. ఎమ్‌డీఆర్ చార్జీలను మోయగలిగే వారిపైనే భారం ఉంటుందన్న వ్యాఖ్యలపై కూడా ఘటుగా స్పందించారు. అలాంటప్పుడు ఎమ్‌డీఆర్‌ను ఛార్జీ అని అనకూడదని, ట్యాక్స్‌గా పేర్కొనాలని తేల్చి చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

అవన్నీ వదంతులే.. యూపీఐపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి

Updated Date - Sep 17 , 2026 | 10:19 PM