Share News

భారత్‌ బయోటెక్‌ రూ.4,600 కోట్ల ఐపీఓ!

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:15 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఓ ద్వారా సుమారు రూ.4,600 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని...

భారత్‌ బయోటెక్‌ రూ.4,600 కోట్ల ఐపీఓ!

ముంబై: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఓ ద్వారా సుమారు రూ.4,600 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని భారత్‌ బయోటెక్‌ లక్ష్యంగా పెట్టుకుందని బ్లూంబర్గ్‌ వార్తా సంస్థ వెల్లడించింది. పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించి చర్చలు చురుగ్గా సాగుతున్నాయని, ఇష్యూ పరిమాణం, జారీ చేసే సమయంలో స్వల్పమార్పులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన భారత్‌ బయోటెక్‌ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వ్యాక్సిన్లు సరఫరా చేసింది. కంపెనీ ఉత్పత్తుల్లో హెపటైటిస్‌ బి, కొవిడ్‌-19 వ్యాక్సిన్లతో పాటు కాలిన గాయాలు, అతిసార వ్యాధులకు ఉపయోగించే ఔషధాలు కూడా ఉన్నాయి.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 02:15 AM