Share News

సెల్‌ థెరపీ ఇన్నోవేషన్‌ కోసం

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:00 AM

వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌.. అనుబంధ సంస్థ న్యుసెలియాన్‌ థెరాప్యూటిక్స్‌.. హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్‌ అంకాలజీ సంస్థ....

సెల్‌ థెరపీ ఇన్నోవేషన్‌ కోసం

న్యుసెలియాన్‌, వీజెన్‌ బయో జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌.. అనుబంధ సంస్థ న్యుసెలియాన్‌ థెరాప్యూటిక్స్‌.. హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్‌ అంకాలజీ సంస్థ వీజెన్‌ బయో ప్రైవేట్‌ లిమిటెడ్‌తో జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా భారత్‌లో ఇన్నోవేటివ్‌ సెల్‌ థెరపీలకు సంబంధించి టెక్నాలజీ బదలాయింపు, క్లినికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, వాణిజ్య ఉత్పత్తిని ఇరు సంస్థలు చేపట్టనున్నాయి. న్యుసెలియాన్‌.. సెల్‌ అడ్‌ జీన్‌ థెరపీ కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌, తయారీలో కీలకంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ చికిత్సలో వినియోగించే వీజెన్‌ బయో కార్‌-టీ థెరపీ ఔషధం వీఎల్‌ -2511 తయారీకి అవసరమైన టెక్నాలజీ బదలాయింపు, వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యుసెలియాన్‌ తోడ్పాటునందించనుంది. అలాగే దేశంలో మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను చేపట్టాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. రెగ్యులేటరీ నిబంధనలకు లోబడి 2028 నాటికి వాణిజ్యపరంగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. హైదరాబాద్‌లోని తన స్పెషలైజ్డ్‌ ప్లాంట్‌లో ఈ ఔషధాన్ని తయారు చేయాలని న్యుసెలియాన్‌ భావిస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..

అమెరికన్‌ పిల్లలకు మస్క్‌ బంపరాఫర్‌

Updated Date - Oct 22 , 2026 | 06:00 AM