న్యుసెలియాన్‌తో పాండోరమ్ టెక్నాలజీ జట్టు
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:04 AM
భారత్ బయోటెక్‌కు చెందిన జీన్ థెరపీ, సీడీఎంఓ సంస్థ న్యుసెలియాన్ థెరాప్యూటిక్స్..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్ బయోటెక్‌కు చెందిన జీన్ థెరపీ, సీడీఎంఓ సంస్థ న్యుసెలియాన్ థెరాప్యూటిక్స్.. బెంగళూరుకు చెందిన టిష్యూ ఇంజనీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్ కంపెనీ పాండోరమ్ టెక్నాలజీస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కంటికి సంబంధించిన రెండు ఔషఽధ ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టి సారించనున్నాయి. అడ్వాన్స్‌డ్ కెరటోపతి, వయో సంబంధిత మాక్యులర్ డీజెనరేషన్ (వెట్ ఏఎండీ)కి సంబంధించిన థెరపీలను అభివృద్ధి చేయటంతో పాటు తయారీని చేపట్టనున్నాయి. ఈ రెండు ఔషధాల కోసం ఇరు సంస్థలు రూ.16.97 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి. ఇందులో రూ.8 కోట్ల నిధులను ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మా-మెడ్‌టెక్ సెక్టార్ (పీఆర్‌ఐపీ) కింద ప్రభుత్వం అందించనుంది.
ఇవి కూడా చదవండి...
కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Read Latest AP News And Telugu News