మగువకు ఆర్థిక భరోసా
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:23 AM
కాలం మారింది. కాలంతో పాటు మహిళల జీవితాలూ మారుతున్నాయి. పురుషులతో సమానంగా ఆర్థికంగానూ ఎదుగుతున్నారు. గతంలో నగనట్రాకే పరిమితమైన మహిళామణులు ఇప్పుడు ఇతర పెట్టుబడులపైనా దృష్టి...
కాలం మారింది. కాలంతో పాటు మహిళల జీవితాలూ మారుతున్నాయి. పురుషులతో సమానంగా ఆర్థికంగానూ ఎదుగుతున్నారు. గతంలో నగనట్రాకే పరిమితమైన మహిళామణులు ఇప్పుడు ఇతర పెట్టుబడులపైనా దృష్టి పెడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్భంగా మన దేశంలో మహిళలకు అందుబాటులో ఉన్న పెట్డుబడి మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.
పీపీఎఫ్
పబ్లిక్ ప్రావిడెంట్‌్ ఫండ్ (పీపీఎ్‌ఫ)గా పిలిచే ఈ పథకం కాలపరిమితి 15 సంవత్సరాలు. పెట్టుబడులకు ఏ మాత్రం ఢోకా లేకుండా దీర్ఘకాలంలో హామీతో కూడిన స్థిరమైన ఆదాయం కోరుకునే మహిళలకు ఇది అత్యంత నమ్మకమైన పెట్టుబడి. కాకపోతే ఈ పథకంపై వడ్డీ రేటును ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సవరిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.1 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఈ పథకంలో పెట్టుబడులతో పాటు వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తానికి కూడా పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ద్వారా మహిళలు షేర్లు, రుణ పత్రాలు, ఇతర సెక్యూరిటీల్లో మదుపు చేయవచ్చు. కొద్దిగా నష్టభయం (రిస్క్) ఉన్నా సంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే ఈ పథకాల్లో రాబడులు ఎక్కువ. పైగా ఈ పథకాల పెట్టుబడులు నిపుణుల పర్యవేక్షణలో ఉంటుంది. మార్కెట్ ఆటుపోట్లకు భయపడకుండా దీర్ఘ కాలంలో మంచి రాబడుల కోసం చూసే వారికి ఎంఎ్‌ఫలు చక్కటి పెట్టుబడి మార్గం. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇస్తాయి.
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)
ఎన్‌పీఎ్‌స ఒక స్వచ్ఛంద రిటైర్మెంట్ పొదుపు పథకం. ఈ పథకం పెట్టుబడులు, నిర్వహణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ (పీఎ్‌ఫఆర్‌డీఏ) నియంత్రణలకు లోబడి ఉంటాయి. ఈ పథకంలో పెట్టుబడులకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. జీవిత చరమాంకంలో ఆర్థిక రక్షణ కోరుకునే మహిళలకు ఇది చక్కటి పొదుపు పథకమని చెప్పవచ్చు. వారి వారి రిస్క్‌ను బట్టి ఈ పథకంలో పెట్టుబడుల చాయిస్‌ను ఎప్పటికప్పుడు మార్చుకునే సౌలభ్యమూ ఈ పథకంలో ఉంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఏ మాత్రం నష్ట భయం లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే మహిళలు బ్యాంకులు లేదా పోస్టల్ శాఖ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ఈ డిపాజిట్ల కాలపరిమితిని కూడా తమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మదుపరులే ఎంచుకోవచ్చు. కంపెనీలు కూడా అధిక వడ్డీ రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆహ్వానిస్తాయి. అయితే వీటి చెల్లింపుల నాణ్యత ఆయా కంపెనీల క్రెడిట్ రేటింగ్‌పై ఆధారపడి ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువ. కాబట్టి మహిళలు వీటి జోలికి పోకపోవడమే మంచిది.
యూలిప్స్
పెట్టుబడుల వృద్ధితో పాటు జీవిత బీమా రక్షణ కోరుకునే మహిళలు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యూలి్‌ప్స)ను ఆశ్రయించవచ్చు. అయితే ఈ పథకాల్లో పెట్టుబడుల వృద్ధి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. పథకం పనితీరు, చార్జీల ఆదారంగా యూలి్‌ప్సను ఎంచుకోవాలి.
జీవిత బీమా
మన జీవితానికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. జరగరానిదేమైనా జరిగితే మన సంపాదనపై ఆదారపడిన వారి జీవితాలు రోడ్డున పడతాయి. ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే మహిళలతో సహా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా పాలసీ తప్పనిసరి. సంపాదన ప్రారంభించిన వెంటనే మహిళలలైనా, పురుషులైనా ఏదైనా మంచి బీమా కంపెనీ నుంచి టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది.
మహిళలు ఎవరికి వారు లేదా వారి ఆర్థిక భద్రత కోసం వారి కుటుంబ సభ్యులు ఈ పెట్టుబడి సాధనాలను ఎంచుకోవచ్చు. మహిళల ఆర్థిక అవసరాలు, జీవిత లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను ఎంచుకోవాలి. ఇక్కడ ఎన్‌పీఎ్‌స, ఈపీఎ ఫ్‌ను ఉద్యోగాలు చేస్తున్న వారు మాత్రమే ఎంచుకోవాలి. మిగతా పెట్టుబడులను వారి తరపున వారి కుటుంబసభ్యులు కూడా నిర్వహించవచ్చు.
పసిడి
బంగారంపై మన దేశంలో మహిళలకు ఉన్నంత మోజు మరే దేశంలోనూ లేదని చెప్పవచ్చు. బంగారు నగలు ధరించడం నిన్న మొన్నటి వరకు ఒక హోదా. పసిడి ధర అమాంతం పెరగటంతో ఇప్పుడది ఆర్థిక భద్రతకూ కూడా చిహ్నంగా మారింది. బిస్కట్లు, కడ్డీలు, నాణేలు లేదా నగల రూపంలో దీన్ని కూడబెట్టవచ్చు. దొంగల భయం ఉందనుకుంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ), గోల్డ్ ఈటీఎ్‌ఫల రూపంలోనూ కూడబెట్టవచ్చు. పెరిగే ధరల పోటు నుంచి పసిడి పెట్టుబడులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రతి మహిళ తన మొత్తం పెట్టుబడుల్లో కనీసం 15 నుంచి 20 శాతం పసిడిలో ఉంచుకోవడం మంచిది.
ఈపీఎఫ్
ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చక్కటి రిటైర్మెంట్ పొదుపు పథకం. ప్రభుత్వం ఏటా ఈ పథకంపై చెల్లించే వడ్డీ రేటును సవరిస్తుంటుంది. అయితే సాధారణంగా ఈ వడ్డీ రేటు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. పైగా ఈపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే మధ్య మధ్య కొన్ని అవసరాలకు కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునే సౌలభ్యమూ ఉంటుంది.
క్యాపిటల్
గ్యారెంటీ ప్లాన్స్
కొద్దిపాటి మార్కెట్ రిస్క్‌కు సిద్ధపడే మహిళలు జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేసే క్యాపిటల్ గ్యారెంటీ పథకాల్లోనూ మదుపు చేయవచ్చు. ఈ పథకాల పెట్టుబడులపై మెచ్యూరిటీ సమయంలో కొంత రాబడికి బీమా కంపెనీలు హామీ ఇస్తాయి. అయితే ఈ పథకాల రాబడులు, మార్కెట్ పనితీరును బట్టి ఉంటాయి. అయితే ఈ పథకాల్లో మదుపు చేసే ముందే పథకం షరతులు, ఫీజులు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్
ఖమేనీ నలుగురు కొడుకులు క్షేమం.. వెలుగుచూసిన ఫోటోలు