తెలంగాణపై బెన్‌క్యూ ఫోకస్
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:08 AM
తెలంగాణ లో ప్రీమియం డిస్‌ప్లే సొల్యూషన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని డిస్‌ప్లే టెక్నాలజీ, సొల్యూషన్స్ సంస్థ బెన్‌క్యూ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణ లో ప్రీమియం డిస్‌ప్లే సొల్యూషన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని డిస్‌ప్లే టెక్నాలజీ, సొల్యూషన్స్ సంస్థ బెన్‌క్యూ ఇండియా ఎండీ రాజీవ్ సింగ్ వెల్లడించారు. ఐటీ పరిశ్రమతో పాటు వీఎ్‌ఫఎక్స్ హబ్‌గా హైదరాబాద్ ఉండటంతో బెన్‌క్యూ ఉత్పత్తులైన మానిటర్లు, ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎ్‌ఫపీ)కు మంచి డిమాండ్ ఉంటోందన్నారు. ఇందుకు తగ్గట్టుగా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను తీసుకువస్తోందని తెలిపారు. కాగా కంపెనీ ఎల్‌సీడీ మానిటర్ రిటైల్ విక్రయాల్లో తెలంగాణ వాటా 8 శాతంగా ఉందని సింగ్ తెలిపారు. 2024తో పోల్చితే 2025లో వృద్ధి రేటు 27 శాతంగా ఉందన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వ స్మార్ట్ ఎడ్యుకేషన్ కార్యక్రమం కింద 8,700 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసినట్లు సింగ్ తెలిపారు. విద్యా రంగంలో డిజిటల్ సొల్యూషన్స్ ్జకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటంతో ఈ అవకాశాలను దక్కించుకోవటంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా డాలర్ మారకంలో రూపాయి క్షీణిస్తుండటంతో మానిటర్లు, ఐఎ్‌ఫపీల ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరగనున్నాయని సింగ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..