బీన్యూ మొబైల్స్‌లో దసరా ఆఫర్లు
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:48 AM
బీన్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్.. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. గురువారం నాడిక్కడ సంస్థ సీఎండీ...
హైదరాబాద్: బీన్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్.. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. గురువారం నాడిక్కడ సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేష్, ఈడీ సాయి నితేష్ మాట్లాడుతూ.. దసరా పండగను పురస్కరించుకుని బీన్యూలో రూ.9,999 నుంచే మొబైల్ ఫోన్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. కొత్త మోడళ్లలో వివో వీ80, ఒప్పో ఎఫ్35 సిరీస్, ఐఫోన్ 18 సిరీస్, సామ్సంగ్ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ 8 సిరీస్ ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు గృహోపకరణాలు, టీవీలు, ల్యాప్టా్పలపై కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఫ్యామిలీ హోమ్ ప్యాక్‌లో ఏసీ, 32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ, వాషింగ్ మెషిన్, ఎయిర్ ఫ్రైయర్, గీజర్‌ను రూ.55,999కే ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీని రూ.29,999కే అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన కొనుగోళ్లపై ఎస్బీఐ ద్వారా రూ.15,000, హెచ్డీబీ ద్వారా రూ.31,000, బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా రూ.5,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా
ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంకు