Share News

బీఈఎంఎల్‌కు రూ.590 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:20 AM

క్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.590 కోట్ల విలువైన ఆర్డర్‌ను చేజిక్కించుకున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్‌ వెల్లడించింది...

బీఈఎంఎల్‌కు రూ.590 కోట్ల ఆర్డర్‌

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.590 కోట్ల విలువైన ఆర్డర్‌ను చేజిక్కించుకున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్‌ వెల్లడించింది. ఆర్డర్‌లో భాగంగా భారత సైన్యం వినియోగించే టీ-72, టీ-90 ట్యాంకులకు అవసరమైన ట్రాల్స్‌ అసెంబ్లీలను సమకూర్చాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఈఎంఎల్‌ పేర్కొంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా డీఆర్‌డీఓ, పుణెలోని రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీరింగ్‌ సహకారంతో ఈ ప్రత్యేక ట్రాలీలను తయారు చేయనున్నట్లు బీఈఎంఎల్‌ సీఎండీ శంతను రాయ్‌ తెలిపారు. కాగా భారత సైన్యం కోసం మందు పాతరలను తొలగించే పరికరాలను బీఈఎంఎల్‌ తయారు చేయనుంది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్

భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

Updated Date - Apr 22 , 2026 | 05:20 AM