Share News

బీఈ పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ఓకే

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:33 AM

నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సిన్‌ సమగ్ర ఉత్పత్తికి బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ (బీఈ)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ...

 బీఈ పోలియో వ్యాక్సిన్‌కు  డబ్ల్యూహెచ్‌ఓ ఓకే

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సిన్‌ సమగ్ర ఉత్పత్తికి బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ (బీఈ)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి ఇందుకు అవసరమైన ఫేజ్‌ 2 అనుమతి లభించినట్టు బీఈ తెలిపింది. దీంతో కంపెనీకి చెందిన ప్లాంట్లలో ఈ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చు. ఫేజ్‌ 1 అనుమతితో కంపెనీ ఇప్పటికే 100 కోట్ల డోసులకు పైగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసి డబ్ల్యూహెచ్‌ఓ వివిధ దేశాలకు సరఫరా చేసింది.

ఇవి కూడా చదవండి..

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 13 , 2026 | 03:33 AM