ఎంఎస్ఎంఈలకు రూ.35 వేల కోట్ల రుణాలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 04:53 AM
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), పరిశ్రమలకు బ్యాంకులు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) కింద...
ఈసీఎల్‌జీఎస్ కింద మంజూరు చేసిన బ్యాంకులు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), పరిశ్రమలకు బ్యాంకులు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) కింద రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. మే 5న కేంద్ర క్యాబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ ప్రవాహాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా దెబ్బతిన్న విమానయాన రంగానికి రూ.5వేల కోట్లున్నాయి. మే 29నాటికి రుణదాతలు సుమారు 80వేల దరఖాస్తులను ఆమోదించి రూ.35,194 కోట్ల రుణాలను మంజూరు చేశారని, అలాగే రూ.15,720 కోట్ల విలువైన గ్యారెంటీలను జారీ చేసినట్టు ఆర్థిక సర్వీసుల శాఖ జాయింట్ సెక్రటరీ మనోజ్ ముత్తతిల్ అయ్యప్పన్ సోమవారంనాడిక్కడ పాత్రికేయులకు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం