బ్యాంకుల బాదుడు షురూ
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:33 AM
ఆర్‌బీఐ రెపో రేటు పెంచడమే ఆలస్యం. రుణాలపై వడ్డీ రేట్లు పెంచేస్తున్నట్లు ఆరు బ్యాంకులు ప్రకటించాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్...
ఆర్‌బీఐ రెపో రేటు పెంచడమే ఆలస్యం. రుణాలపై వడ్డీ రేట్లు పెంచేస్తున్నట్లు ఆరు బ్యాంకులు ప్రకటించాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) తమిళనాడు మర్కైంటైల్ బ్యాంక్ తమ రెపో ఆధారిత వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్), ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేట్లను పెంచేశాయి. పెంచిన వడ్డీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. త్వరలోనే మిగతా బ్యాంకులు కూడా ఈ బ్యాంకులను అనుసరిస్తాయని భావిస్తున్నారు.
బ్యాంకు పేరు ప్రస్తుత పెంచిన
వడ్డీ రేటు వడ్డీ రేటు
పీఎన్‌బీ 8.10 8.35
ఇండియన్ బ్యాంక్ 7.95 8.20
బీఓబీ 7.90 8.15
బీఓఐ 8.10 8.35
ఐఓబీ 8.10 8.35
టీఎంబీ 8.25 8.50
మధ్య తరగతికి భారమే
రెపో రేటు పెంపు మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను మరింత దూరం చేయనుంది. వీరు ఎక్కువగా కొనే రూ.75 లక్షల కంటే తక్కువ ధర ఉండే అందుబాటు ధరల (అఫర్డబుల్) ఇళ్ల అమ్మకాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు కొనే రూ.75 లక్షల నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉండే గృహాల విక్రయాలపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ‘ఈఎంఐల భారం కొద్దిగా పెరిగినా.. అందుబాటు ధరల ఇళ్లు కొనే వ్యక్తులు తమ నిర్ణయాలను వాయిదా వేస్తారు’ అని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ గ్రూప్ అధినేత అనూజ్ పురి తెలిపారు. పండగల సీజన్‌లో ఆర్‌బీఐ ఈ రెపో రేటు పెంచడం ఈ గృహ అమ్మకాలను తప్పకుండా దెబ్బతీస్తుందని క్రెడాయ్, నరెడ్కో, పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
రూ.50 లక్షల గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ
కాల పరిమితి 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు
వడ్డీ రేటు 7.5% 7.75%
ఈఎంఐ రూ.36,950 రూ.37,766
మొత్తం వడ్డీ - రూ.60,84,868 రూ.63,29,931
పెరిగే వడ్డీ - రూ.2,45,064
పెరిగే ఈఎంఐ - రూ.817
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి