Share News

బ్యాంకింగ్‌ సంస్కరణలకు ఇదే సరైన సమయం

ABN , Publish Date - Aug 18 , 2026 | 05:34 AM

బ్యాంకింగ్‌ రంగంలో మలి విడత సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా ఇందుకోసం త్వరలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని...

బ్యాంకింగ్‌ సంస్కరణలకు ఇదే సరైన సమయం

  • త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

  • ‘వికసిత్‌ భారత్‌’ కోసం బ్లూప్రింట్‌ తయారీ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో మలి విడత సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా ఇందుకోసం త్వరలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఆర్థిక సంస్థల (పీఎ్‌ఫసీ) చైర్మన్లు, ఎండీలు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆమె ఈ విషయం ప్రకటించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు వీలుగా బ్యాంకింగ్‌ రంగాన్ని ఆర్థికంగా ఎలా సిద్ధం చేయాలనే బ్లూప్రింట్‌ సిద్ధం చేస్తుందన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో చర్చించే విషయాలు ఈ కమిటీకి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం ఎంతో దూరంలో లేదన్నారు. ‘ప్రస్తుతం మన బ్యాంకు ల మొండి బకాయిలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలకు ఇంత కంటే మంచి సమయం రాదు’ అని సీతారామన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక స్థిరత్వం, సమ్మిళిత అభివృద్ధి, వినియోగదారులు ప్రయోజనాలు కాపాడుతూనే ఈ కమిటీ బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణలను సిఫారసు చేస్తుందన్నారు.

పీ ఎస్ బీ లూ పారాహుషార్‌

పోటీ తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో పీఎ్‌సబీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్‌ లోహియా కోరారు. టెక్నాలజీ వ్యాపార నమూనాలను మార్చేస్తోంది. ఖాతాదారులు అనుభవాలూ మారిపోతున్నాయి. కొత్త ఆర్థిక కార్యకలాపాలు శరవేగంగా పుట్టుకొస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పీఎ్‌సబీలు తమ ఆర్థిక స్థితిగతులను బలోపే తం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ పోటీకి తగ్గట్టు ఎదగాలని కోరారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు కూడా పీఎ్‌సబీలకు తగ్గట్టు ప్రత్యేక నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. సుస్థిర ఆర్థిక వృద్ధికి డిపాజిట్ల సమీకరణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 05:34 AM