బ్యాంకింగ్ ఉద్యోగులూ సమ్మెలు వద్దు
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:27 AM
డిమాండ్ల సాధన కోసం సమ్మెలకు దిగవద్దని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. బ్యాంకింగ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది...
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం సమ్మెలకు దిగవద్దని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. బ్యాంకింగ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని కోరింది. ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ కోరికల సాధన కోసం ఈ నెల 28వ తేదీ నుంచి మళ్లీ సమ్మెకు దిగుతామని బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో వరుసగా మూడు రోజుల పాటు దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేయడం విశేషం. ఇదే సమయంలో ఉద్యోగుల సమ్మె ప్రభావం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పెద్దగా పడకుండా, వీలైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులను ఆర్థిక శాఖ కోరింది.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..