Share News

బీఓఎం గృహ రుణ రేటు తగ్గింపు

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:47 AM

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) వినియోగదారులకు తీపి కబురు అందించింది. ప్రత్యేక...

బీఓఎం గృహ రుణ రేటు తగ్గింపు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) వినియోగదారులకు తీపి కబురు అందించింది. ప్రత్యేక పరిమితకాల ఆఫర్‌ ‘మాన్సూన్‌ ధమాకా’ కింద గృహ రుణాల రేట్లను 7.1 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా కార్‌ లోన్‌ను 7.45 శాతం వడ్డీ రేటుతో పాటు ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు, డాక్యుమెంటేషన్‌ చార్జీలు లేకుండా అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో వినియోగదారులకు ఈఎంఐతో పాటు తదితర ఖర్చుల భారం గణనీయంగా తగ్గుతుందని బ్యాంక్‌ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 04:47 AM