కార్ల రుణ వడ్డీ రేట్లు తగ్గింపు బీఓబీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:06 AM
తమ కారు రుణాల కనీస చర (ఫ్లోటింగ్) వడ్డీ రేటును 7.9 నుంచి 7.6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రుణ గ్రహీతల పరపతి...
న్యూఢిల్లీ: తమ కారు రుణాల కనీస చర (ఫ్లోటింగ్) వడ్డీ రేటును 7.9 నుంచి 7.6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రుణ గ్రహీతల పరపతి స్కోరును బట్టి ఈ వడ్డీ రేటు మారుతుంది. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఫిక్స్‌డ్ (స్థిర) వడ్డీ రేటు ఆధారంగా మంజూరు చేసే కారు లోన్ల కనీస వడ్డీ రేటు 8.5 శాతంతో ప్రారంభమవుతుందని బ్యాంకు పేర్కొంది. కారు లోన్ల మొత్తాన్ని ఒకేసారి లేదా పాక్షికంగా చెల్లించినా ఎలాంటి ముందస్తు చెల్లింపు చార్జీలు కూడా ఉండవని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..