Share News

బీఓబీ హైదరాబాద్‌ జోనల్‌ హెడ్‌గా ఎంవీఎస్‌ సుధాకర్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:35 AM

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ హెడ్‌గా...

బీఓబీ హైదరాబాద్‌ జోనల్‌ హెడ్‌గా ఎంవీఎస్‌ సుధాకర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ హెడ్‌గా ఎంవీఎస్‌ సుధాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు బీఓబీ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోకి వస్తాయి. సుధాకర్‌ ఇప్పటి వరకు బీవోబీ ఢిల్లీ జోనల్‌ హెడ్‌గా పని చేశారు. బ్యాంకింగ్‌ రంగంలో మూడు దశాబ్ధాలకుపైగా అనుభవం ఉన్న ఆయన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్‌ల్లో పనిచేశారు.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 05:35 AM