Share News

ఆదివారం బ్యాంకులు ఓపెన్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:19 AM

బ్యాంకింగ్‌ ఉద్యోగుల సమ్మె ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వచ్చే ఆదివారం...

ఆదివారం బ్యాంకులు ఓపెన్‌

  • 27న కార్యకలాపాలు

  • యూనియన్ల సమ్మె నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ ఉద్యోగుల సమ్మె ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వచ్చే ఆదివారం (27వ తేదీ) ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ) పని చేయనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వారానికి ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకింగ్‌ ఉద్యోగుల్లో 90 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే యునైటెడ్‌ ఫోరం ఫర్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎ్‌ఫబీయూ) పిలుపు ఇచ్చింది. ఈ నెల 26, 27 తేదీలూ బ్యాంకులకు వారాంతపు సెలవులు. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు దేశంలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు స్తంభించి పోనున్నాయి. ఈ పరిస్థితి నుంచి కొంతలో కొంత గట్టెక్కేందుకు వచ్చే ఆదివారం కూడా పని చేయాలని ప్రభుత్వం.. పీఎ్‌సబీలు, ఆర్‌ఆర్‌బీలను కోరిందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 05:19 AM