Share News

పెంపుడు జంతువుల కోసం బీమా

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:21 AM

బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ ‘మై ఫ్యామిలీ కంప్లీట్‌’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది..

పెంపుడు జంతువుల కోసం బీమా

బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘మై ఫ్యామిలీ కంప్లీట్‌’ పాలసీ

బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ ‘మై ఫ్యామిలీ కంప్లీట్‌’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కుటుంబం నిర్వచనాన్ని విస్తరిస్తూ పెంపుడు కుక్కలు, పిల్లులను కూడా కుటుంబ సభ్యులుగా పరిగణించి బీమా పరిధిలోకి తెచ్చింది. ఈ పాలసీ కింద రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఐదేళ్ల వరకు పాలసీ కాలవ్యవధిని ఎంచుకునే అవకాశం ఉంది. మనుషులు, పెంపుడు జంతువులకు ఒకే పాలసీ కింద సమగ్ర రక్షణ కల్పించనున్నారు. ఇందులో ఆస్పత్రిలో చేరినప్పుడు ఖర్చు లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు, తర్వాతి వైద్య ఖర్చు లు, ఆధునిక చికిత్సలు తదితరాలకుకవరేజీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్

Updated Date - Sep 06 , 2026 | 05:21 AM