ఎంఎస్ఎంఈలపై మరింత ఫోకస్
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:25 AM
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల వ్యాపార అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నట్లు ప్రైవేట్ రంగంలోని..
యాక్సిస్ బ్యాంక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల వ్యాపార అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నట్లు ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. గురువారం నాడిక్కడ బ్యాంక్ మిడ్ కార్పొరేట్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ టీఎస్, కమర్షియల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ విజయ్ శెట్టి మాట్లాడుతూ.. బ్యాంక్ ఎంఎస్ఎంఈ రుణాలు రూ.2.93 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు. బ్యాంక్ మొత్తం రుణ పోర్టుఫోలియోలో ఇది 23.8 శాతంగా ఉండగా.. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ విభాగంలో 8.1 శాతం మార్కెట్ వాటా అని వివరించారు. కాగా తెలంగాణలో 24 వేలకు పైగా ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ సేవలందిస్తోందని వారు తెలిపారు. 2025-26లో ఈ సంస్థలకు రూ.14,847 కోట్ల వరకు రుణాలను ఇచ్చినట్లు చెప్పారు. ఉద్యమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటున్న ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, అందుకనుగుణంగా వారి వ్యాపారాభివృద్ధికి బ్యాంక్ తోడ్పాటునందిస్తోందన్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో బ్యాంక్‌కు 199 శాఖలుండగా కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!