బ్యాంకులు భళా..
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:36 AM
జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం 22.23ు వృద్ధి చెంది రూ.7,632.31 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం..
క్యూ1లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల లాభాల జోరు
22% పెరిగిన యాక్సిస్ బ్యాంక్ లాభం
జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం 22.23ు వృద్ధి చెంది రూ.7,632.31 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.6,243.72 కోట్లుగా ఉంది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన నికర లాభం 23ు పెరిగి రూ.7,114 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం రూ.14,646 కోట్లుగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ లాభంలో 14% వృద్ధి
ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.15,440 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి ప్రకటించిన నికర లాభం (రూ.13,558 కోట్లు)తో పోల్చితే వృద్ధి 13.88 శాతంగా ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 15.95ు వృద్ధితో రూ.14,804 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 12.7ు పెరిగి రూ.24,384 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 1.67ు నుంచి 1.38 శాతానికి తగ్గాయి.
పీఎన్‌బీ లాభంలో మూడింతల వృద్ధి
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. జూన్ త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.5,253 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.1,675 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా మూడింతలు వృద్ధి చెందింది. నూతన పన్ను విధానానికి మారడంతో పన్ను భారం రూ.3,358 కోట్లకు తగ్గడం లాభాల్లో పెరుగుదలకు ప్రధాన కారణమని బ్యాంక్ తెలిపింది. అంతేకాకుండా తొలి త్రైమాసికంలో రూ.5,000 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించటం బ్యాంక్ చరిత్రలోనే ఇది మొదటిసారని పీఎన్‌బీ ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర తెలిపారు. కాగా సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.37,231 కోట్ల వద్ద స్థిరంగా ఉండగా.. వడ్డీ ఆదాయం మాత్రం రూ.31,964 కోట్ల నుంచి రూ.32,897 కోట్లకు పెరిగింది.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!