Share News

అరబిందో చేతికి లాన్నెట్‌

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:45 AM

అరబిందో ఫార్మా.. మరో అమెరికా కంపెనీని కొనుగోలు చేస్తోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేసే క్లిష్టమైన జెనరిక్‌ ఔషధాల తయారీ సంస్థ లాన్నెట్‌...

అరబిందో చేతికి లాన్నెట్‌

డీల్‌ విలువ రూ.2,365 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మా.. మరో అమెరికా కంపెనీని కొనుగోలు చేస్తోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేసే క్లిష్టమైన జెనరిక్‌ ఔషధాల తయారీ సంస్థ లాన్నెట్‌ కంపెనీ ఎల్‌ఎల్‌సీను 25 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2,365 కోట్లు) కొనుగోలు చేస్తున్నట్టు అరబిందో ఫార్మా రెగ్యులేటరీ సంస్థలకు వెల్లడించింది. ఈ కొనుగోలుకు యూఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) కూడా ఇందుకు అమోదం తెలిపింది. అమెరికాలోని తన అనుబంధ సంస్థ అరబిందో ఫార్మా యూఎ్‌సఏ ఇంక్‌ ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్టు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఈ నెలాఖరులోగా లాన్నెట్‌ కొనుగోలు పూర్తి కావచ్చని పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగారం దిగుమతులు 70 శాతం డౌన్‌

బంగారం, వెండి భారీగా తగ్గాయ్‌

Updated Date - Jun 23 , 2026 | 05:45 AM