అరబిందో ఫార్మా లాభం రూ.1,124 కోట్లు
ABN , Publish Date - Nov 05 , 2026 | 02:42 AM
అరబిందో ఫార్మా లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.1,123.84 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని...
ఒక్కో షేరుకు రూ.7 డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అరబిందో ఫార్మా లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.1,123.84 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం రూ.848.13 కోట్లతో పోల్చితే వృద్ధి 32.5 శాతంగా నమోదైంది. సమీక్షా కాలంలో కార్యకలాపాల నుంచి రాబడి 23.9 శాతం వృద్ధితో రూ.8,286 కోట్ల నుంచి రూ.10,263 కోట్లకు చేరుకుంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా అత్యధిక త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం వ్యయాలు రూ.7,132.03 కోట్ల నుంచి రూ.8,740.9 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..