అరబిందో ఫార్మా లాభం రూ.1,032 కోట్లు
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:21 AM
అరబిందో ఫార్మా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్ త్రైమాసికానికి గాను కంపెనీ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అరబిందో ఫార్మా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్ త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 25.2 శాతం వృద్ధి చెంది రూ.1,032 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.824 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ రూ.7,868 కోట్ల నుంచి రూ.9,150 కోట్లకు పెరిగింది. నిర్వహణాపరంగా మంచి పనితీరును కనబరచటంతో పాటు ఉత్పత్తుల పోర్టుఫోలియోను పటిష్ఠం చేయటంపై దృష్టి పెట్టడం కలిసి వచ్చిందని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ నిత్యానంద రెడ్డి తెలిపారు.
అమెరికా ఆదాయంలో వృద్ధి: జూన్ త్రైమాసికంలో అమెరికా రాబడులు 8.1 శాతం వృద్ధితో రూ.3,488 కోట్ల నుంచి రూ.3,770 కోట్లకు చేరుకున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. యూరప్ ఆదాయాలు 25.6 శాతం వృద్ధితో రూ.2,338 కోట్ల నుంచి రూ.2,937 కోట్లకు చేరుకోగా వర్ధమాన దేశాల రెవెన్యూ ఏకంగా 37.7 శాతం వృద్ధితో రూ.772 కోట్ల నుంచి రూ.1,063 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ) ఆదాయాలు 14.6 శాతం వృద్ధితో రూ.1,049 కోట్లుగా నమోదయ్యాయని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో అమెరికా మార్కెట్లోకి 10 ఔషధాలను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం