Share News

ఏప్రిల్‌ 1 నుంచి ఆడి కార్ల ధరలు 2 శాతం పెంపు

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:16 AM

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారత మార్కెట్లో తమ వాహనాల ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి...

ఏప్రిల్‌ 1 నుంచి ఆడి కార్ల ధరలు 2 శాతం పెంపు

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారత మార్కెట్లో తమ వాహనాల ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానుంది. ముడి పదార్ధాల ధరల పెరుగుదల, రూపాయి మారకంలో హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ఈ నెల 17న మార్కెట్లోకి విడుదల చేయనున్న ఆడి ఎస్‌క్యూ8 కారు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:16 AM