Share News

ఫార్మా రంగంలో రూ.38 లక్షల కోట్ల మెగా విలీనం!

ABN , Publish Date - Aug 04 , 2026 | 05:04 AM

ప్రపంచ ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో మెగా విలీనం జరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఔషధ దిగ్గజాలైన ఆస్ట్రాజెనెకా, బ్రిస్టల్‌ మైయర్‌ స్క్విబ్‌ (బీఎంఎస్‌) ఒక్కటయ్యే...

ఫార్మా రంగంలో రూ.38 లక్షల కోట్ల మెగా విలీనం!

న్యూఢిల్లీ: ప్రపంచ ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో మెగా విలీనం జరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఔషధ దిగ్గజాలైన ఆస్ట్రాజెనెకా, బ్రిస్టల్‌ మైయర్‌ స్క్విబ్‌ (బీఎంఎస్‌) ఒక్కటయ్యే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఒప్పందం కొలిక్కి వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా మార్కెట్‌ విలువ 26,500 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండగా.. అమెరికన్‌ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన బీఎంఎస్‌ మార్కెట్‌ విలువ 13,300 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఈ రెండు కంపెనీల విలీనంతో దాదాపు 40,000 కోట్ల డాలర్ల (రూ.38 లక్షల కోట్లు) విలువైన సంస్థ ఏర్పడనుంది. అమెరికా మార్కెట్‌పై ఫోకస్‌ పెంచిన నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా.. బీఎంఎ్‌సను విలీనం చేసుకోవాలని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 05:04 AM