Share News

ప్రత్యేక కంపెనీగా స్పేస్‌, హైడ్రాలజీ వ్యాపారాలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:02 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్‌.. తన స్పేస్‌, మెటియోరాలజీ, హైడ్రాలజీ వ్యాపారాలను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన...

ప్రత్యేక కంపెనీగా స్పేస్‌, హైడ్రాలజీ వ్యాపారాలు

ఆస్ట్రామైక్రోవేవ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్‌.. తన స్పేస్‌, మెటియోరాలజీ, హైడ్రాలజీ వ్యాపారాలను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈ వ్యాపారాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకే ఈ మూడు వ్యాపారాలను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. దీనివల్ల కంపెనీ వాటాదారులకూ లబ్ది చేకూరుతుందని ఆస్ట్రా మైక్రోవేవ్‌ పేర్కొంది.

  • మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తన ప్రీమియం రిటైల్‌ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు సిద్ధమైంది. చిన్న ఫార్మాట్‌ ప్రీమియం అవుట్‌లెట్స్‌.. నెక్సా స్టూడియోలను 2030-31 నాటికి దేశవ్యాప్తంగా 600-700 వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 02:02 AM