Share News

ఆస్టర్‌ డీఎం క్వాలిటీ హెల్త్‌కేర్‌ ఆదాయం రూ.2,597 కోట్లు

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:25 AM

ఆస్టర్‌ డీఎం క్వాలిటీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక...

ఆస్టర్‌ డీఎం క్వాలిటీ హెల్త్‌కేర్‌ ఆదాయం రూ.2,597 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆస్టర్‌ డీఎం క్వాలిటీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక రెవెన్యూ 20% వృద్ధితో రూ.2,597 కోట్లకు చేరుకుంది. కాగా జూన్‌ త్రైమాసికంలో నిర్వహణ స్థూలలాభం 30ు వృద్ధి చెంది రూ.576 కోట్లుగా నమోదైంది. ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, క్వాలిటీ కేర్‌ ఇండియా విలీనం అనంతరం ఈ సంస్థ ఏర్పాటైంది. జూలై 1 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది. ఈ కాలంలో ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ఆదాయం రూ.1,311 కోట్లుగా ఉండగా క్వాలిటీ కేర్‌ రెవెన్యూ రూ.1,287 కోట్లుగా ఉంది.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 04:25 AM