ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:23 AM
దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని ఆస్పత్రుల్లో 4,080 కొత్త పడకల ఏర్పాటు కోసం రూ.4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ప్రకటించింది...
రూ.4,000 కోట్ల పెట్టుబడి
కొత్తగా 4,080 పడకలు
హైదరాబాద్‌లో కొత్త హాస్పిటల్
ఒంగోలు హాస్పిటల్ విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని ఆస్పత్రుల్లో 4,080 కొత్త పడకల ఏర్పాటు కోసం రూ.4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ప్రకటించింది. క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ (క్యూసీఐఎల్) విలీనానికి తమకు వాటాదారుల తుది అనుమతి లభించినట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆజాద్ మూపెన్ తెలిపారు. తాము ప్రకటించిన అదనపు పడకల్లో 2,368 పడకలను ఆస్టర్ డీఎం, మిగతా పడకలను క్యూసీఐఎల్ ఏర్పాటు చేస్తాయని ఆయన చెప్పారు. తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌లో 300 పడకల విమెన్ అండ్ చిల్డ్రన్ ఆస్పత్రి ఉన్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఒంగోలులోని ఆస్టర్ రమే్‌షలో 75 అదనపు పడకలు జోడించనున్నట్టు ఆయన వెల్లడించారు. రాబోయే కొద్ది సంవత్సరాల కాలంలో తమ మొత్తం పడకల సామర్థ్యం 14,710కి చేర్చాలన్నది లక్ష్యమని చెప్పారు. విలీన సంస్థ బోర్డులో ఆస్టర్ ప్రమోటర్లు, బ్లాక్‌స్టోన్ సంస్థకు సమాన ప్రాతినిథ్యం ఉంటుందని, ఆజాద్ మూపెన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. క్యూసీఐఎల్‌కు చెందిన వరుణ్ ఖన్నా గ్రూప్ సీఈఓ, ఎండీగా వ్యవహరిస్తారు.
ఇవి కూడా చదవండి..
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..