ఆరాజెన్ లైఫ్‌సైన్సెస్ రూ.3,500 కోట్ల ఐపీఓ!
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:07 AM
అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ పెట్టుబడులు కలిగిన హైదరాబాద్ కంపెనీ ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమవుతోంది...
త్వరలోనే సెబీకి దరఖాస్తు సమర్పించనున్న సంస్థ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ పెట్టుబడులు కలిగిన హైదరాబాద్ కంపెనీ ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమవుతోంది. ఇందుకు అనుమతి కోసం సెబీకి త్వరలోనే ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.3,500 కోట్ల వరకు సమీకరించనున్నట్లు సమాచారం. ఐపీఓలో భాగంగా సంస్థ తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన కొంత వాటాను సైతం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడంతో పాటు భవిష్యత్ వ్యాపార వృద్ధికి అవరమైన పెట్టుబడులు పెట్టాలని ఆరాజెన్ భావి స్తోంది. 2000లో ప్రారంభమైన ఈ కంపెనీ 400కు పైగా కస్టమర్లకు ఔషధాల ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ఉత్పత్తి సేవలందిస్తోంది. దేశీయంగా హైదరాబాద్, వైజాగ్‌తో పాటు బెంగళూరు,పుణెలో కేంద్రాలను నిర్వహిస్తోంది.అమెరికాలోని కాలిఫోర్నియాలో బయోలాజిక్స్ రీసెర్చ్ క్యాంప్‌సను కూడా కలిగి ఉంది.
అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ పెట్టుబడులు కలిగిన సప్లయ్ చెయిన్ ఆపరేటర్ లీప్ ఇండియా లిమిటెడ్‌తో పాటు మౌలిక రంగ కంపెనీ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్‌ల ఐపీఓలు ఈ నెల 7న ప్రారంభమై 11న ముగియనున్నాయి. లీప్ ఇండియా రూ.2,480 కోట్ల ఐపీఓలో షేర్ల ధర శ్రేణిని రూ.151-159గా నిర్ణయించింది. టెక్నోక్రాఫ్ట్ రూ.252 కోట్ల ఐపీఓ ధరల శ్రేణి రూ.200 -212గా ఉంది.
స్పెషాలిటీ ఫార్మా కంపెనీ ఎన్‌క్యూబ్ ఎథికల్స్ ఐపీఓ ద్వారా రూ.3,000 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి కోరుతూ సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది.
ఇవి కూడా చదవండి:
నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ