హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:49 AM
ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. హైదరాబాద్‌లోనూ రిటైల్ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ స్టోర్‌లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియను...
సిబ్బంది నియామకాల ప్రక్రియ షురూ
హైదరాబాద్: ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. హైదరాబాద్‌లోనూ రిటైల్ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ స్టోర్‌లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం కంపెనీ తాజాగా జాబ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. టెక్నికల్ స్పెషలిస్టులు, బిజినెస్ ఎక్స్‌పర్ట్స్, ఆపరేషన్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు ఫుల్ టైం, పార్ట్ టైం మరియు టెంపరరీ ఎక్స్‌పర్ట్స్, మేనేజర్స్‌గా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. యాపిల్.. భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను 2023లో ముంబైలో ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..