భారత మార్కెట్లో యాపిల్ పే సేవలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:21 AM
అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత పేమెంట్ మార్కెట్లోకి ప్రవేశించింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో తన ‘యాపిల్ పే’ సర్వీసును ప్రారంభించింది....
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత పేమెంట్ మార్కెట్లోకి ప్రవేశించింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో తన ‘యాపిల్ పే’ సర్వీసును ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని బ్యాంకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరే అవకాశం ఉంది. యాపిల్ వినియోగదారులు తమ ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్‌లను వినియోగించి దేశ, విదేశాల్లో యాపిల్ పే సర్వీసును వినియోగించుకోవచ్చు. యాపిల్ పే అరంగేట్రంతో భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి కంపెనీల హవా నడుస్తోంది. కాగా యాక్సిస్ బ్యాంకు జారీ చేసిన వీసా, మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులను యాపిల్ పేకి యాడ్ చేసుకుని లావాదేవీలను అనుమతించే ఏ ప్రదేశంలోనైనా ఉపయోగించవచ్చని పేర్కొంది. యాపిల్ డివైజ్‌ల యూజర్లు, స్టోర్లు, యాప్‌లు, వెబ్‌లో పిన్‌లను, ఓటీపీలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది.
భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతుల జోరు: భారత్ నుంచి యాపిల్ భారీ స్థాయిలో ఐఫోన్లను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) 1,320 కోట్ల డాలర్ల (రూ.1.26 లక్షల కోట్లు) విలువైన ఐఫోన్లను యాపిల్ ఎగుమతి చేసింది. గతేడాది ఇదేకాలంతో పోల్చితే ఎగుమతులు దాదాపు 47ు పెరిగాయి. ఇదే కాలంలో ఈ ఫోన్ల ఎగుమతులు దేశ మొత్తం ఎలక్ర్టానిక్స్ ఎగుమతుల్లో దాదాపు సగం వాటాను కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో దేశ స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో ఐఫోన్ల వాటా 82 శాతంగా ఉంది.
ఈ వార్తలూ చదవండి
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..
దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..