Share News

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారత్‌లో యాపిల్ పే షురూ

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:15 AM

టెక్ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు భారత్‌లో కూడా తన కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వ్యవస్థ యాపిల్ పేను తాజాగా ప్రవేశపెట్టింది. ఇకపై ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ యూజర్లు సులువుగా డిజిటల్ విధానంలో చెల్లింపులు జరపవచ్చు.

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారత్‌లో యాపిల్ పే షురూ
Apple Pay in India

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు భారత్‌లో కూడా తన కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వ్యవస్థ యాపిల్ పేను తాజాగా ప్రవేశపెట్టింది. ఇకపై ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ యూజర్లు సులువుగా డిజిటల్ విధానంలో చెల్లింపులు జరపవచ్చు. అయితే, ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు జారీ చేసిన వీసా, మాస్టర్ క్రెడిట్ కార్డులకే యాపిల్ పే సేవలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఇతర బ్యాంకులకు విస్తరిస్తామని యాపిల్ ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆధారిత డిజిటల్ వాలెట్‌గా యాపిల్‌ పేను ప్రపంచవ్యాప్తంగా జనాలు వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో యూపీఐకి ఈ సేవలు అనుసంధానం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ భారత వినియోగదారులు తమ యాపిల్ పేకు అనుమతి ఉన్న కార్డులను జోడించి చెల్లింపులు జరపవచ్చు.

‘టెక్‌పై మంచి పట్టు ఉన్న యువత భారత్‌లోఉంది. నగదు రహిత చెల్లింపులవైపు వీరు మొగ్గు చూపుతున్నారు. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో కూడా కట్టుదిట్టమైన చర్యలు ఉండాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో యాపిల్ పే లాంచ్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని యాపిల్ పే, వాలెట్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ జెన్నిఫర్ బెయిలీ తెలిపారు.


పిన్, ఓటీపీల అవసరం లేకుండానే..

యాపిల్ పేతో యూజర్లు పిన్ లేదా ఓటీపీ లేకుండానే చెల్లింపులు జరపవచ్చు. ఫేస్ ఐడీ లేదా, టచ్ ఐడీ లాంటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌తో చెల్లింపులు జరపవచ్చు. పేమెంట్ టర్మినల్‌కు సమీపంలో డివైజ్‌ పెట్టి బయోమెట్రిక్ ఐడీతో ఆథెంటికేట్ చేస్తే సులువుగా పేమెంట్ జరిగిపోతుంది. యాజర్ల కార్డు నెంబర్స్‌ గోప్యంగా ఉంచడం ఈ ఫీచర్‌కు ఉన్న మరో ప్రత్యేకత. ఈ వ్యవస్థలో కార్డు నెంబర్‌ను యూజర్‌ల డివైజులు, సర్వర్‌లల్లో స్టోర్ చేయడం లేదా వ్యాపారులతో షేర్ చేయడం ఉండదు. ఇందుకు బదులుగా ఎన్‌క్రిప్టిన్ చేసిన ప్రత్యేక డివైజ్ అకౌంట్ నెంబర్‌ను యాపిల్ వినియోగిస్తుంది. ఐఫోన్‌లో యూపీఐ సేవల కోసం మునుపటి వలెనే ఫోన్ పే, గూగుల్ పే వంటివి వినియోగించవచ్చు.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు

‘జీ’ సుభాష్‌ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు

Updated Date - Sep 30 , 2026 | 11:24 AM