Share News

మడత పెట్టే ఐఫోన్‌ వచ్చేసిందోచ్‌..

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:21 AM

ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌ ఎట్టకేలకు మడత పెట్టే(ఫోల్డబుల్‌) ఫోన్ల విభాగంలోకి ప్రవేశించింది. కాలిఫోర్నియా, కుపర్టినోలోని యాపిల్‌ పార్క్‌లో ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ పేరుతో...

మడత పెట్టే  ఐఫోన్‌ వచ్చేసిందోచ్‌..

ఐఫోన్‌ డువో పేరుతో ఆవిష్కరణ

ప్రారంభ ధర 1,999 డాలర్లు

అక్టోబరులో విక్రయాలు ప్రారంభం

కాలిఫోర్నియా (అమెరికా): ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌ ఎట్టకేలకు మడత పెట్టే(ఫోల్డబుల్‌) ఫోన్ల విభాగంలోకి ప్రవేశించింది. కాలిఫోర్నియా, కుపర్టినోలోని యాపిల్‌ పార్క్‌లో ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ పేరుతో బుధవారం నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. ఐఫోన్‌ డువో (జంట) అని దీనికి నామకరణం చేసింది. యాపిల్‌ కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు చేపట్టాక కంపెనీ విడుదల చేసిన తొలి ఉత్పత్తి ఇదే. ఏ 20 ప్రో ప్రాసెసర్‌, 48 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 12 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాతోపాటు ఫోన్‌ రెండు తెరలకు విడివిడి బ్యాటరీలతో కూడిన ఈ ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా కేవలం ఈ-సిమ్‌ వసతితో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే, ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ మడత పెట్టినప్పుడు 5.4 అంగుళాలు (పా్‌సపోర్ట్‌ సైజు), తెరిచినప్పుడు 7.6 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 256 జీబీ మెమొరీ సామర్థ్యంతో కూడిన ఐఫోన్‌ డువో ప్రారంభ వేరియంట్‌ ధర 1,999 డాలర్లు. యాపిల్‌ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యంత ఖరీదైన ఐఫోన్‌. 2రంగుల్లో (స్టార్‌ వైట్‌, నైట్‌ స్కై) లభించనుంది. అక్టోబరు 23న భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

ఐఫోన్‌ 18 ప్రో,

18 ప్రోమ్యాక్స్‌ లాంచ్‌

యాపిల్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌తో పాటు ఐఫోన్‌ 18 సిరీస్‌ మోడళ్లను సైతం లాంచ్‌ చేసింది. ఐఓఎస్‌ 27 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, ఏ 20 ప్రో ప్రాసెసర్‌తో కూడిన ఐఫోన్‌ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్లను మరింత మెరుగైన బ్యాటరీ, హార్డ్‌వేర్‌ పనితీరు, 48 మెగా పికెల్స్‌ కెమెరా సామర్థ్యాలతోపాటు అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. నాలుగు రంగుల్లో (డీప్‌ బ్లాక్‌, సిల్వర్‌, గ్లేసియర్‌ బ్లూ, బర్గండీ).. 256జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ మెమొరీ సామర్థ్యాల్లో ఇవి లభించనున్నాయి. ఈనెల 12 నుంచి బుకింగ్‌ ప్రారంభంకానుండగా.. 18వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.


యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12

మరింత మెరుగైన హెల్త్‌కేర్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్లతోపాటు యాపిల్‌ ఆడియో ఇంటెలిజెన్స్‌తో కూడిన యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12, వాచ్‌ అలా్ట్రను సైతం కంపెనీ ఆవిష్కరించింది. వాచ్‌ సిరీస్‌ 12 రంగుల్లో లభించనున్నాయి. బుధవారం నుంచి బుకింగ్‌ ప్రారంభమవుతుంది. 18వ తేదీ నుంచి మార్కెట్లోకి రానున్నాయి.

ఎయిర్‌పాడ్స్‌ 5

మరింత ఆధునిక నాయిస్‌ క్యాన్సలేషన్‌ ఫీచర్లతో కూడిన ఎయిర్‌పాడ్స్‌ 5ను సైతం లాంచ్‌ చేసింది సంస్థ. బుధవారం నుంచి బుకింగ్‌ ప్రారంభం. 18 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.

10-Business.jpgఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 03:23 AM