Share News

రూ.లక్ష కోట్లకు చేరువలో యాపిల్‌ ఇండియా ఆదాయం

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:11 AM

యాపిల్‌ ఇండియా రాబడి జోరుగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రాబడి వార్షిక ప్రాతిపదికన 20 శాతానికి పైగా పెరిగి రూ.లక్ష కోట్లకు చేరువైంది...

రూ.లక్ష కోట్లకు చేరువలో యాపిల్‌ ఇండియా ఆదాయం

న్యూఢిల్లీ: యాపిల్‌ ఇండియా రాబడి జోరుగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రాబడి వార్షిక ప్రాతిపదికన 20 శాతానికి పైగా పెరిగి రూ.లక్ష కోట్లకు చేరువైంది. వార్షిక ప్రాతిపదికన ఐఫోన్‌ సరఫరాలు 24 శాతం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. యాపిల్‌ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.79,000 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర రాబడిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఫోన్ల రికార్డు స్థాయి సరఫరాలతో భారత్‌లో యాపిల్‌ రాబడి 1,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.లక్ష కోట్లు) దాటిందని ఆ వర్గాలు తెలిపాయి. గత కొన్ని త్రైమాసికాలుగా భారత్‌లో యాపిల్‌ రికార్డు స్థాయి పనితీరును కనబరుస్తోంది.

ఇవి కూడా చదవండి:

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్

Updated Date - Aug 05 , 2026 | 05:12 AM