25శాతం ఐఫోన్లు భారత్‌లోనే తయారీ
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:56 AM
యాపిల్ కంపెనీ భారత్‌లో ఐఫోన్ల తయారీని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. గత ఏడాది కాలంలో ఐఫోన్ల ఉత్పత్తిని 53% మేరకు పెంచినట్లు తెలిసింది....
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ భారత్‌లో ఐఫోన్ల తయారీని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. గత ఏడాది కాలంలో ఐఫోన్ల ఉత్పత్తిని 53% మేరకు పెంచినట్లు తెలిసింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణం గా యాపిల్ కంపెనీ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల వేటలో పడడం, అందుకు భారత్ అనుకూలమైన దేశంగా పరిగణించడం ఇందుకు కారణం. కంపెనీ గణాంకాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 2025లో భారత్‌లో 5.5 కోట్ల హ్యాండ్‌సెట్లు తయారుచేసిందని అంచనా. ఏటా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ 22 కోట్ల నుంచి 23 కోట్ల ఐఫోన్లు ఉత్పత్తి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమలుపరుస్తున్న ఉత్పత్తి అనుసఽంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ద్వారా అందుతున్న మద్దతు తమ వ్యయాలు కొంతమేరకు తగ్గేందుకు దోహదపడిందని యాపిల్ ప్రతినిధి చెప్పారు. అయితే చైనా, వియత్నాంల తో పోల్చితే భారత్‌లో ఎలక్ర్టానిక్స్ అసెంబ్లీ, తయారీ వ్యయాలు అధికంగానే ఉన్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..