ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్‌లు ప్రియం
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:30 AM
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్ తన ఐప్యాడ్, మ్యాక్‌బుక్ మోడళ్లతోపాటు హోమ్ డివైజ్‌ల ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది...
ఐఫోన్ల రేట్లు మాత్రం యథాతథం
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్ తన ఐప్యాడ్, మ్యాక్‌బుక్ మోడళ్లతోపాటు హోమ్ డివైజ్‌ల ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. పెరిగిన రేట్లు భారత్ సహా ప్రపంచవ్యాప్త మార్కెట్లలో అమల్లోకి రానున్నాయి. దేశీయ మార్కెట్లో వీటి ధర మోడల్‌ను బట్టి 20 నుంచి 42 శాతం వరకు పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధి నేపథ్యంలో మెమొరీ చిప్‌ల కొరతతో పాటు వాటి ధరలు అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని యాపిల్ పేర్కొంది. అయితే ఐఫోన్ల ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించింది. ఎం5 చిప్‌తో కూడిన 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ.1,19,900 నుంచి రూ.1,49,900కు పెరిగింది. ఎం5 చిప్, 16జీబీ ర్యామ్ తో కూడిన 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో రూ.70,000 పెరుగుదలతో రూ.1,69,900 నుంచి రూ.2,39,900కు ఎగబాకింది. ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ నియో రూ.69,900 నుంచి రూ.79,900కు చేరింది. ఎం5 చిప్‌తో కూడిన 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మ్యాక్స్ వేరియంట్ ధర రూ.2,49,900 నుంచి రూ.2,99,900కు పెరిగింది.
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!